Home Page SliderInternational

ప్రధాని మోదీకి పారాలింపియన్ స్పెషల్ గిఫ్ట్

Share with

పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొని, భారత్‌కు 29 పతకాలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పారిస్‌లో పాల్గొన్న పారాలింపియన్స్‌ను ప్రధాని మోదీ ఈ రోజు ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన నివాసానికి పిలిపించి, వారందరితో వ్యక్తిగతంగా మాట్లాడి, అనుభవాలు తెలుసుకున్నారు.  మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన షూటర్ అవనీ లేఖరా ప్రధాని మోదీకి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను బహుకరించింది. తాను సంతకం చేసిన టీ షర్టును ప్రధానికి బహుమతిగా ఇస్తూ, ‘టీ షర్ట్ వెనుక మీ మద్దతుకు ధన్యవాదాలు సార్’ అంటూ రాసింది. సెప్టెంబర్ 8న ముగిసిన ఈ క్రీడా వేదికలో భారత్ 7 స్వర్ణపతకాలు, 9 రజత పతకాలు, 13 కాంస్య పతకాలతో మొత్తం 29 పతకాలు సాధించింది. పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ టాప్ 20లో చేరింది. 18వ స్థానాన్ని గెలుచుకుంది.