ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని
ఓ స్మార్ట్ ఫోన్ టీచర్ స్టూడెంట్ మధ్య చిచ్చు పెట్టింది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని బూతులు తిడుతూ ఓ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. టీచర్ ఓ విద్యార్థిని ఫోన్ తీసుకుందని.. టీచర్‌తో స్టూడెంట్ వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విద్యార్థిని చేసిన పనికి ఫైర్ అవుతున్నారు.

