లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా లేడీ అఘోరీ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆ లేడి అఘోరి బండారం బయటకు వచ్చింది. లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే అంటూ బయటకు వచ్చి బండారం బయటపెట్టింది. తమ పెళ్లి జనవరి 1న జరిగిందని యువతి తెలిపింది. ఆ తర్వాత వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటికి వచ్చినట్లు వెల్లడించింది. మీడియా, పోలీస్ శాఖ, ప్రభుత్వం ఈ విషయంలో అఘోరీపై చర్యలు తీసుకోవాలని యువతి డిమాండ్ చేసింది.

