హైడ్రాపై కాంగ్రేసీయుల గరం గరం
అక్రమ కూల్చివేతలపై ఉక్కుపాదం మోపిన హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి… అక్రమ లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని సొంత ప్రభుత్వంపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు.. నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హైడ్రాపై మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

