Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

చిత్తూరులో ..జులాయి మూవీ బ్యాంక్ సీన్‌

ఐడిబిఐ బ్యాంకులో చోరీకొచ్చి అడ్డంగా దొరికిపోయింది ఓ దొంగ‌ల ముఠా.అది అలాంటి ఇలాంటి ముఠా అనుకునేరు….అచ్చం జులాయి సినిమాలో విల‌న్ సోనూసూద్ గ్యాంగ్ స్ట‌ర్ చేసిన బ్యాంకు రాబ‌రీ మాదిరిగా చేయ‌బోయబోయిన ముఠా అది.అయితే అక్క‌డ ప‌ట్టుబ‌డ‌లేదు.ఇక్క‌డ ప‌ట్టుబ‌డిపోయారు.చిత్తూరు న‌గ‌రంలోని గాంధీ రోడ్డులో ఉన్న‌ ఐడిబీఐ బ్యాంకులో చోరీకి వ‌చ్చిన దొంగ‌లు ..బ్యాంకు ప‌క్క‌నే ఉన్న ఇంటి మేడ‌పైకి ఎక్కి బ్యాంకు భ‌వ‌నంలోకి దూక‌పోతుండ‌గా స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు గుట్టుగా స‌మాచారం అందించారు.కొద్దిసేప‌టికే దొంగ‌లు బ్యాంకు భ‌వ‌నం గోడ‌ను కొద్దిగా ప‌గ‌ల‌గొట్టారు.దాంతో అప్ర‌మ‌త్త‌మైన బ్యాంకు భ‌వ‌నం య‌జ‌మాని…గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో స్థానికులంతా గుమిగూడారు. ప‌గ‌డ్బంధీగా రంగ‌ప్ర‌వేశం చేసిన పోలీసులు న‌లుగురు దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు.అయితే వారంతా తుపాకులు ధ‌రించిన సాయుధ‌వ‌డంతో శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌న్న ఉద్దేశ్యంతో గంట‌ల స‌మ‌యం తీసుకుని దొంగ‌ల‌ను ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు. మ‌రికొంత మంది ప‌రారీలో ఉన్నారు.జులూయి సినిమాలో వాడిన రాబ‌రీ వ్యాన్ కూడా తెచ్చుకున్నారు దొంగ‌లు.దాన్ని కూడా స్వాధీనం చేసుకుని స్టేష‌న్‌కి త‌ర‌లించారు.పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.దొంగ‌ల ద‌గ్గ‌ర ఉన్న తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నారు.