పాలిటెక్నిక్‌లో 8,748 సీట్లు ఖాళీ
హైదరాబాద్: పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 8,748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 114 కళాశాలల్లో 29,610 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 20,862 (70.46 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు ఈ నెల 15 లోపు ఫీజు చెల్లించి.. 16వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు.