ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురించి 5 కీలకాంశాలు
బసవరాజ్ బొమ్మై కర్ణాటక అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నిక
షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008, 2013, 2018లో విజయం
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 225 స్థానాలకు గానూ 104 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టినా, విశ్వాసపరీక్ష ముందు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) చేతులు కలిపాయి. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కుప్పకూలిన తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో ఆ పార్టీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

1) జూలై 2021లో కర్నాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టారు. బీఎస్ యడ్యూరప్ప తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు.
2) బొమ్మై కర్నాటక అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికయ్యారు. 2008లో షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన, 2013, 2018లో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
3) బొమ్మై శక్తివంతమైన లింగాయత్ వర్గానికి చెందినవారు. కర్నాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరే వరకు బొమ్మై, జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఉన్నారు.
4) బొమ్మై జలవనరులు, లా, హోం, అసెంబ్లీ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.
5) బొమ్మై మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. మూడేళ్లు పూణేలోని టాటా మోటార్స్‌లో పనిచేశారు.

