Breaking NewsTelangana

రెండో విడతలో 415 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 415 మంది సర్పంచ్‌లు , 8,304 మంది వార్డు మెంబర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాల్లో అత్యధికంగా కామారెడ్డిలో 44, నల్గొండ, నిజామాబాద్‌లో 38 చొప్పున సర్పంచ్‌లు ఎన్నిక కావడం విశేషం. రెండో విడతలో 4,332 పంచాయతీలు, 38,322 వార్డుల్లో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 5 గ్రామపంచాయతీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ విషయానికి వస్తే, సర్పంచ్ ఎన్నిక నుంచి 7,584 మంది, వార్డుల్లో 10,427 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ రెండు విడతల వివరాలను కలిపి చూస్తే, ఇప్పటివరకు రాష్ట్రంలో 810 మంది సర్పంచ్‌లు మరియు 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.