InternationalNews

ఒక్కరోజులో చైనాలో 30 వేల కరోనా కేసులు

చైనాలో విజృంభిస్తున్న కరోనా కేసులు
కఠిన ఆంక్షలపై తిరగబడుతున్న చైనీయులు
గరిష్ట స్థాయికి చేరుకున్న రోజువారీ కోవిడ్ కేసులు
ఒక్కరోజులో నమోదైన కేసులు 31,454
కేసుల్లో లక్షణాల్లేనివారు 27,517

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి చైనా రోజువారీ కోవిడ్ కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గురువారం విడుదల చేసిన అధికారిక డేటా మేరకు దేశంలో కరోనా విజృంభిస్తోంది. స్నాప్ లాక్‌డౌన్లు, సామూహిక పరీక్షలు, ప్రయాణ పరిమితులతో వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ కేసులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో 31,454 దేశీయ కేసులు నమోదయ్యాయి. వాటిలో 27,517 లక్షణాలు లేకుండా ఉన్నాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. లక్షణాల్లేకుండా వ్యాధి వ్యాపిస్తోండటం వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని.. కొన్నిసార్లు కొందరికి ప్రాణాపాయం వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన చైనాలో నిబంధనల చిచ్చు రేపుతున్నాయి. కోటి 40 లక్షల జనాభాతో పోల్చినప్పుడు కేసుల సంఖ్య తక్కువైనా… ఆ దేశం అనుసరించిన విధానాలు వల్లే తాజాగా కరోనా విజృంభణకు కారణమని తెలుస్తోంది. కరోనాను డీల్ చేయడం విషయంలో మొదట్నుంచి చైనా అతి చేసింది. కరోనా పుట్టించిందే చైనా అన్న రూమర్లున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేతగానితనం, చైనా అసమర్థత కారణంగా.. వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. కరోనా విజృంభించి భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగలో ఇప్పుడు చైనా ఉంది. కఠినమైన జీరో-కోవిడ్ విధానాన్ని అవలంబిస్తూ అక్కడి ప్రజలు ఉసురుపోసుకుంటోంది. వైరస్ ఉందంటే చాలు… నగరాలకు నగరాలను సైతం లాక్ డౌన్‌ విధించేస్తోంది. కరోనా సోకిన రోగులను కఠినమైన నిర్బంధంలో ఉంచుతోంది.


మహమ్మారి మూడో సంవత్సరానికి చేరువవుతున్న తరుణంలో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం కంటి మీద కునుకులేకుండా బతుకుతోంది. కఠిన నిబంధనలు విధించడం వల్ల చైనా ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారని.. ఇక చాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శనలతో చైనా నగరాలు హోరెత్తుతున్నాయి. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. కరోనా వ్యాప్తితో పరిశ్రమలపై పెను ప్రభావం చూపెడుతోంది. ఉత్పాదకతను దెబ్బతీంది. మెగాసిటీ షాంఘై లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కరోనా కేసులు 30 వేలుగా ఉంటే.. తాజాగా అవి ఆ సంఖ్యను దాటిపోయాయి. కరోనా వ్యాధి విజృంభణతో సామాన్యుల జీవితం అస్తవ్యస్థమైపోతోంది. ఆహారం కొనడానికి, వైద్య చికిత్స కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.