3 రాష్ట్రాలు.. 3 రాజధానులు… జగన్‌కు జగ్గారెడ్డి సూపర్ సలహా
నిత్యం వివాదాస్పద వార్తలతో సంచలనంగా నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఏపీలో సమగ్ర అభివృద్ధి కోసం, వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు తప్పవంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే.. మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చూస్తే ముగ్గురు సీఎంలుగా ఉండొచ్చన్నారు. అలా చేయడం వల్ల జగన్ ఫ్యామిలీ సమస్యలు కూడా తీరతాయన్నారు. కుటుంబలో పంచాయితీ ఉంటే… అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిందిపోయి.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. తనను కేటీఆర్ కోవర్ట్‌ని షర్మిల మాట్లాడటం దురదృష్టమన్నారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల మాట పక్కకుబెట్టి.. మూడు రాష్ట్రాలు చేసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులవుతారని కూడా చెప్పారు జగ్గారెడ్డి. విభజిస్తే జగన్, షర్మిల, విజయసాయిరెడ్డి ముగ్గురు సీఎంలు అవుతారన్నారు. షర్మిల కుటుంబ పంచాయితీ అక్కడే పెట్టుకోవాలన్న జగ్గారెడ్డి… అవసరమైతే ప్రధాని మోదీతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవచ్చునన్నారు. షర్మిల తన జోలికి రాకుంటే తాను ఆమె జోలికి వెళ్లనన్నారు.


