Telangana

18 వేల కోట్లు వర్సెస్ 18 లక్షల కోట్లు

మునుగోడులో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతుంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయ్. బీజేపీ ఇచ్చిన 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుకు ఆశపడి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని టీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తే… ధరణి పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా 18 లక్షల కోట్ల రూపాయల భూములను కేసీఆర్ కుటుంబం చేతిల్లోకి వెళ్లిపోయాయంటూ ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మామూళ్లు వసూలు చేశాక.. 6 లక్షల భూములను రిలీజ్ చేశారని… మిగతా 18 లక్షల కోట్ల భూములు కేసీఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయంటూ ఆరోపించారు. పైసలిస్తేనే భూములను రిలీజ్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 18 వేల కోట్లు మునుగోడు నియోజకవర్గానికి కేటాయిస్తే తాము ఎన్నికల బరిలోంచి తప్పుకుంటామంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి రాజగోపాల్ రెడ్డి ధరణి అస్త్రాన్ని బయటకు తీశారు. మునుగోడు ఎన్నికల నవంబర్ 3న జరగనుండగా.. ప్రచారం ఇప్పటికే పీక్‌కు చేరింది.