అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనం
సెంట్రల్ కోల్ కతాలోని ఓ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహన మయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. కోల్ కతాలోని బుర్రాబజార్ ఏరియాలోని ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న రీతురాజ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రీతురాజ్ హోటల్లో మంటలు చెలరేగాయని కోల్ కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. 14 మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

