దిగుమతులతో ఇండియాలో ఆర్థిక కల్లోలం
భారతదేశం పూర్వం నుండీ ఎంతో రకాల సహజ సంపదకు పుట్టినిల్లు. రాజుల కాలంలో వజ్ర,వైఢూర్యాలకు కూడా కొదవ ఉండేది కాదు. రాయలకాలంలో రాసులుగా పోసి, అమ్మేవారని చదువుకున్నాం. ఇక ఆహారం, దుస్తుల విషయంలో ప్రపంచదేశాల కన్నా ఏనాడో ముందుడేది భారతదేశం. కానీ మారుతున్న ప్రపంచీకరణ ప్రభావంతో దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య సంబంధాలు బాగా పెరిగాయి. వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇతరదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రధానంగా భారత్ దిగుమతి చేసుకొనే 10 వస్తువులు వాటి విలువ డాలర్లలో రిజర్వుబాంక్ ఆఫ్ ఇండియా 2021 ఆర్ధిక సంవత్సరానికి విడుదల చేసింది. రూపాయి విలువ తగ్గిపోతూ ఒక డాలర్‌కి 80 రూపాయిలు అయ్యింది . అనగా 1 బిలియన్ డాలర్ సుమారుగా 8వేల కోట్లకు సమానమయ్యింది.
తాజా గణాంకాల ప్రకారం పెట్రోలియం ప్రాడక్టులు, క్రూడ్ ఆయిల్ దిగుమతులలో మొదటి స్థానంలో ఉన్నాయి. వాటి విలువ 82.7 బిలియన్ డాలర్లు. అనగా దాదాపు 6,61,600 వేలకోట్లు. తర్వాత స్థానాల్లో వరుసగా ఎలక్ట్రానిక్ వస్తువులు 52.6 బిలియన్లు అనగా 4,20,800వేలకోట్లు. బంగారం-34.6 అనగా 2,76,800 వేలకోట్లు. మెషినరీ,ఎలక్ట్రికల్ వస్తువులు-31.8 అనగా 3,02,400వేలకోట్లు. ముత్యాలు,సహజరత్నాలు-18.9 అనగా 1,51,200వేలకోట్లు. రవాణా సాధనాలు-17.9 అనగా 1,43,200 వేలకోట్లు. కోల్,కోక్,బ్రిక్విటీస్ -16.3 అనగా 1,30,400 వేలకోట్లు. ప్లాస్టిక్, అసహజవస్తువులు-13.5 అనగా 1,08,00 వేలకోట్లు. ఐరన్-స్టీలు-12.1 అనగా 96800 వేలకోట్లు. ఇతరవస్తువులు-93.5 అనగా 7,48000 వేలకోట్లు .మొత్తం దిగుమతులు 393.7 అనగా 31,49600 వేలకోట్లు అవుతోంది.
రూపాయి మారకం విలువ రోజురోజుకీ దిగజారిపోవడం వలన దిగుమతుల విలువ పెరిగి భారం అధికమవుతోంది. ప్రభుత్వం, ప్రజలు పొదుపు పాటిస్తూ, కావలసిన వస్తు,సేవలను దేశంలోనే తయారుచేసేందుకు ప్రయత్నిస్తే ఈభారాన్ని తగ్గించవచ్చు. రూపాయి విలువ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని భావించవచ్చు.