టీఆర్‌ఎస్ పార్టీ నుండి మురళీయాదవ్ సస్పెన్షన్
టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రోజురోజుకీ వలసలు ఎక్కువవుతున్నాయి. పార్టీలో అసమ్మత్తి పెరిగిపోతోంది. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకపోవడం, కుటుంబపాలనాధికారాలు ఎక్కువవడం వంటి చర్యలతో కేసీఆర్‌పై సొంతపార్టీలోనే వ్యతిరేఖతలు పెరిగిపోయాయి. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీ యాదవ్ కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కేసీఆర్ ఉద్యమకారులకు, బీసీలకు టీఆర్‌ఎస్‌లో స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. ఒక్కసారి కూడా ZPTC మీటింగ్‌లకు రావడం లేదని, ఇతరపార్టీలనుండి వచ్చినవారికే పదవులిస్తున్నారనీ విమర్శించారు. బడుగు,బలహీనవర్గాలవారిని అవమానపరిచారని మండిపడ్డారు. దీనితో పార్టీ అతనిపై చర్యలకు సిద్దమయ్యింది. మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మురళీయాదవ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీచర్యలకు వ్యతిరేఖంగా మాట్లాడడం సరికాదని, కూర్చున్నకొమ్మనే నరుక్కుంటున్నారని మండిపడ్డారు. ఆయనకు, ఆయన భార్యకు పార్టీ జడ్పీ చైర్ పర్సన్, మున్సిపల్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టిందని, ఎవరితో సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, తన మనసులో ఏదో ఆలోచనతో పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.