గోరంట్ల మాధవ్‌పై డీజీపీకి లేఖ….
ఏపీ అధికార పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. పార్టీ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనిస్తోంది. అసలేం జరిగిందో పూర్తి స్ధాయిలో తెలుసుకున్న తర్వాత మాధవ్ పై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడకూడదని వైసీపీ భావిస్తోంది.

గౌరవప్రదమైన ఎంపీ హోదాలో ఉండి ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ చేసి మాట్లాడిన వైనం ఇప్పుడు అధికార పార్టీని ఇరకాటంలో నెడుతోంది. విపక్షాల విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై విపక్రాష పార్వటీ తెలుగుదేశం తీవ్రస్ధాయిలో మండిపడుతోంది. అయితే తన వీడియోని పూర్తిగా మార్ఫింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు. తాను జిమ్‌లో ఉండగా తీసిన వీడియోను మార్చారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని అంటున్న మాధవ్.. ఫోరెన్సిక్ పరీక్షకు కూడా రెడీ అన్నారు. ఇదిలావుండగా ఈ వ్యవహారంపై AP మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. డీజీపీకి ఓ లేఖ రాస్తూ.. ఈ వ్యవహారంపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి నిజానిజాలను బయటపెట్టాలని కోరారు. గోరంట్ల మాధవ్ వ్యవహారం మహిళా లోకానికే తీరని తలవంపులు తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.