Home Page SliderTelangana

రోజురోజుకీ పెరుగుతున్న ఎండలు-వడదెబ్బలకు ప్రజలు బలి

గత వారం రోజులుగా రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని వాతావరణశాఖ తెలియజేసింది. జూన్ 5 తర్వాత కానీ, నైరుతి పవనాలు కేరళను తాకవని భారత వాతావరణశాఖ అంచనాలు వేస్తోంది. ప్రతీ సంవత్సరం మే చివరి వారంలోనే కేరళకు చేరగా, తెలుగు రాష్ట్రాలకు జూన్ రెండవవారానికి చేరుకుంటాయి. ఇప్పుడు ఇంకా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఓపక్కతెలంగాణాలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రామగుండం, మెదక్,నిజామాబాద్, హైదరాబాద్,మెహబూబ్ నగర్‌లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో 46 డిగ్రీల పైనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చిరు వ్యాపారులు, కూలీలు చాలామంది వడదెబ్బలకు రాలిపోతున్నారు.  విజయనగరం జిల్లాలో ప్రకాష్ అనే హోం గార్డు వడదెబ్బకు మరణించాడు. రాబోయే వారం రోజుల్లో ఇంకో మూడు డిగ్రీలు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది.