HealthHome Page SliderTrending Today

ఆ అలవాటును మానలేకపోతున్నారా..?

పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటూ ప్రతి పండుగకు మందు పక్కగా ఉండాల్సిందే. కొందరైతే కారణాలు వెతుక్కుని మరి ప్రతిరోజు తాగుతుంటారు. కానీ మందు మీ శరీరానికి అంతా మంచిది కాదు. ముఖ్యంగా ఒకేసారి గ్లాసులకు గ్లాసు లాగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె నుంచి కడుపు వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందును ఎక్కువగా తాగితే మీ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. మందును మోతాదు మించి తాగినప్పుడు మీ పేగులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయకుండా ఆపుతాయి. ఇది ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మద్యపానం మనుషుల ఆరోగ్యాలనే కాకుండా కుటుంబ వ్యవస్థలను సైతం చిన్నాభిన్నం చేస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా దెబ్బ తీయడమే కాకుండా కుటుంబాల్లో చిచ్చు రాజేస్తుంది. తాగుడుకు అలవాటు అయిన భర్తలతో భార్యలు ఎంతలా ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో తమ భర్తలను తాగుడు మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. భర్త అలవాటును మాన్పించాలంటే కాస్త ఓపిక కావాలి. కోపం తెచ్చుకోకుండా వారి సమస్యను అడిగి తెలుసుకోవాలి. తాగుడు వల్ల వచ్చే ఆరోగ్య, ఆర్థిక సమస్యలను వివరించాలి. తాగినప్పుడు వాదన చేయకుండా.. ఆయన వినగల స్థితిలో ఉన్నప్పుడు మెల్లగా నచ్చచెప్పాలి. వ్యసనం నుంచి బయటపడాలన్న ఆలోచన భర్తకు వస్తే.. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మద్యం అలవాటును ఎలా మానుకోవాలి..

ఎన్నో ప్రయత్నాలు చేసిన కూడా మద్యం అలవాటు మాన్పించలేకపోతే ఇలా చేయండి. ప్రతి రోజు అల్పాహారం తీసుకున్న తర్వాత
ఒక్క గ్లాసు నీటిలో కరక్కాయ పొడిని కలుపుకొని త్రాగితే తాగుడుపై విరక్తి కలుగుతుంది. ఇలా రెండు లేదా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఎంత మందుకు బానిసైనా సరే క్రమంగా ఆ అలవాటుకు దూరం కావాల్సిందే.