NationalNews

జొమాటో నమ్ముకుంటే ఏం జరిగిందంటే..!

Share with

షేర్ మార్కెట్ ఎంత లాభాన్ని తెచ్చిపెడుతుందో సరైన అంచనాలు లేకపోతే అంతకు రెండింతలు నష్టపోతారు. దీనికి తాజా ఉదాహరణ జొమాటో షేర్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో ఉన్న సమయంలో అకస్శాత్తుగా జొమాటో షేర్లు దిగాలు పడిపోయాయి. వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా అందరూ పిలుచుకునే రాకేష్ ఝన్‌ఝన్‌వాలా చెప్పిన జోస్యం నిజమయిందంటున్నారు మదుపరులు. గత ఏడాది ఇండియా టుడే  కనక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జొమాటో షేర్లు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరించారు. మదుపర్లను హెచ్చరించారు. నేను ఈరోజు జొమాటో షేర్లు కొనవద్దు అని చెపితే ప్రజలు నన్ను ఫూల్ అంటారు అన్నారు. ఈరోజు మద్యాహ్నం 3 గంటల వేళ జొమాటో ధర 45.90 రూపాయలు ఉండగా 61.33 శాతం పతనమైపోయింది. గతేడాది స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో లిస్టింగ్‌కు వెళ్లిన ఇతర సంస్థల షేర్లు జోరు మీద ఉండడం..పేటీఎం, నైకా షేర్లు, జొమాటో షేర్లు భారీగా పతనం కావడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021 జూలై 23న ఐపీవోకి వెళ్లిన జొమాటోప్రమోటర్లు, ఉద్యోగులు,  ఇతర పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం జూలై 23కి లాక్‌ఇన్ పిరియడ్ ముగిసింది. దానితో గత 4 రోజులుగా 20శాతం స్టాక్ భారీగా పడిపోయింది. దీనితో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ఝన్‌ఝన్‌వాలా మాటలు సీరియస్‌గా తీసుకుని ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు.