Andhra PradeshNewsNews Alert

కేఏ పాల్‌కు కాకినాడలో ఘోర అవమానం

Share with

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలుగు రాష్ట్రలో తెలియని వారు ఉండరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అ మధ్య ఆఫర్ చేశారు…జనసేనను… ప్రజాశాంతి పార్టీలో కలిపిస్తే పవన్ కళ్యాణ్ కు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానంటూ కామెంట్లు కూడా చేశారు. భారీగా నగదు కూడా ప్రకటించారు. ఇలాంటి ఆఫర్లు పాల్ దగ్గర ఎన్నో ఉన్నాయి. దీంతో పాల్ ఆస్తుల విలువ ఎప్పుడు చర్చనీయాంశమే…అలాంటి పాల్‌కు ఆయన అనుచరులే షాక్ ఇచ్చారు.


కేఏ పాల్ కు చెందిన రెండు కార్లను అనుచరుడు రత్నాకర్ సీజ్ చేశారు.కేఏ పాల్ కు భారీగా డబ్బు అప్పుగా ఇచ్చానని తన డబ్బు తిరిగి ఇవ్వడం లేదని రత్నాకార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాకీ తీర్చమని అడిగితే… బెదిరిస్తున్నారు అన్నది రత్నాకార్ వాదన అందుకే ఆ డబ్బు వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో పాల్‌కు చెందిన రెండు కార్లు సీజ్ చేశాడు ప్రస్తుతం కేఏ పాల్ కాకినాడ టూర్‌లో ఉన్నారు. అయితే పాల్ కార్లను హోటల్ లో పార్క్ చేస్తుంటే… వద్దని మన ప్లేసులో పార్క్ చేద్దామని రత్నాకర్ ఒప్పించాడు. దీంతో రత్నాకర్ మాట ప్రకారం సీబీసీఎన్సీ స్కూల్‌ గ్రౌండ్‌లో కేఏ పాల్‌కు చెందిన వాహనాలను పార్కింగ్‌ చేశారు. ఆ వెంటనే రత్నాకర్ అక్కడి గేట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు. వాహనాలను వెళ్లకుండా స్కూల్‌ సిబ్బంది అడ్డుకున్నారు. సీబీసీఎన్సీ డైరెక్టర్‌ రత్నకుమార్‌ చెబితేనే వాహనాలను పంపుతామని సిబ్బంది చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేఏ పాల్‌ కాన్వాయ్‌ వాహనాలను విడిచిపెట్టారు. కాగా తాను హోటల్లో బస చేస్తే.. కార్లను కాలేజ్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌ చేశారని, అంతకు మించి ఏమీ లేదన్నారు కేఎ పాల్‌. కాకినాడ పర్యటన విజయవంతమైందని పాల్ తెలిపారు.