Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ఏ రత్నమో చెప్పాలన్న వైసీపీ ఎంపీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. కాగా చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సరైన ఆధారాలు లేకుండా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.  ఈ మేరకు చంద్రబాబును విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ రత్నమో చెప్పాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జాతి రత్నం,దేశరత్నం అని..ఆయనను కాపాడుకోవాలని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.కానీ చంద్రబాబు జాతి రత్నమో,దేశరత్నమో,ఖండ రత్నమో,గ్రహ రత్నమో మాత్రం చెప్పట్లేదు అన్నారు.అయితే చంద్రబాబు కనీసం తెలుగు దేశ రత్నమని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు ఏమి దేశం గర్వించే వ్యక్తి కాదు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.