కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే
కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైసీపీ కార్యకర్తలు ఇటీవలే అకాల మరణం చెందారు. అయితే.. తనను నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలకు కూడా కంటతడి పెట్టారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైన వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని స్థానికులు చర్చించుకున్నారు.

