దొరా నీవల్ల ఉపయోగమేంటంటూ షర్మిల కౌంటర్
వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల KCRను విమర్మిస్తూ మరోమారు ట్వీట్టర్ వేదికగా సంచల వ్యాఖ్యలు చేశారు. తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని రైతు అత్మహత్యకు సంబంధించిన న్యూస్ షేర్ చేస్తూ KCR పై ప్రశ్నల వర్షం కురిపించారు. మునిగిపోయే కాళేశ్వరానికి లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టొచ్చు కానీ , అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి పైసల్ లేవా..? వానలు, వరదలకు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారన్నారు షర్మిల.
నష్టపోయిన రైతులని ఆదుకోవడం చేతకావడం లేదన్న షర్మిల… ఆసరా లేదని ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులను ఆదుకోవా అని ప్రశ్నించారు. వరదలకు ఇండ్లు మునిగిపోయి , కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు సాయం చేసావా? 10వేల సాయమని ప్రకటనలు చేసి వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు పైసా అన్న ఇచ్చావా? పంటలకు బీమా చేయడం చేతకాదు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులని ఆదుకోవడం చేతకాదు. ఏమి దొర నీవల్ల ఉపయోగం? అని ట్విట్టర్ వేదికగా KCR పై ప్రశ్నల తూటాలను సంధించారు.