Andhra PradeshNews Alert

కాపు నేస్తం మాత్రమే కాదు… చేతలతో కాపు కాస్తాం

Share with

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. కాపు నేస్తం మాత్రమే కాదు.. వారికి చేతల ద్వారా కాపు కాస్తామన్న నమ్మకాన్ని కలిగిస్తామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామన్నారు. ”మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ.45 వేలు ఇచ్చాం. ఇప్పటివరకూ వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం. నవ రత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి జరిగింది. నాన్‌ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో రూ.16 వేల కోట్లు అందాయి. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్లు అందాయి. కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి ఇవాళ రూ.508.18 ​‍కోట్ల లబ్ధి కలిగింది” అని సీఎం జగన్ వివరించారు.

డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు గతంలో అధికార పార్టీ నేతలు చెప్పినవారికే సంక్షేమ పథకాలు అందేవన్నారు. కానీ తమ ప్రభుత్వం కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్‌ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు బాధితులకు రూ. 4 వేలుఇచ్చినట్టుగా ప్రచారం చేసుకొంటున్నారన్నారని కానీ అది నిజం కాదన్నారు. వాస్తవానికి తాజా వరద ముంపు బాధితులకు రూ. 2 వేల ఆర్ధిక సహయం చేసిన ఘతన మన ప్రభుత్వానిదన్నారు జగన్. రేషన్ సరుకులను ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో తాను ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించినట్టుగా ప్రస్తావించారు. కానీ ఆ సమయంలో పాడైన ఆహార, పదార్ధాలతో పాటు అక్కడక్కడ బియ్యం పంపిణీ చేశారని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా ఎమ్మెల్యేలు గడప గడపకు వచ్చి తెలుసుకొంటున్నారన్నారు. మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానన్నారు.