Andhra PradeshNewsNews Alert

ఇంటింటికీ చౌకగా కేబుల్, నెట్, టెలిఫోన్

Share with

ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో సిస్కో భాగస్వామ్యంతో మెదలు పెట్టిన సంస్థ. దీని ముఖ్యఉద్దేశం ఆంధ్ర ప్రజలకు తక్కువ ఖర్చులో నెట్‌వర్క్ కనెక్షన్ అందిచడం. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. తాము సంస్థను తిరిగి లాభాల బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నామని, తమకు 9 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారన్నారు. ట్రిపుల్ ప్లే ద్వారా కేబుల్ , నెట్,ఫోన్ అందజేస్తున్నామన్నారు. కేబుల్ ఎమ్‌ఎస్‌ఓలు, ఆపరేటర్స్ ప్రభుత్వ విధానాలు ప్రజలకు తెలిసేలా చేస్తామన్నారు. బాక్స్ లు లేవు, సర్వీస్ లేదని పుకార్లు వస్తున్నాయని దీనివల్ల కొత్త బాక్స్ లు కొనుగోలు చేయాలని, బాక్స్ ల నాణ్యత పరిశీలించాలని బోర్డ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత బాక్స్ ల కన్నా మెరుగైన నాణ్యమైన బాక్స్ లు తీసుకు వస్తున్నామని, ఈ ప్రభుత్వం పోల్ టాక్స్ ధరను పెంచడం జరిగింది కాబట్టి పాత కేబుల్ ఆపరేటర్‌లు పోల్ టాక్స్‌తో ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యవహారాన్ని మంత్రుల కమిటీ దృష్టికి పోల్ టాక్స్ సమస్యను వివరించడంతో జీఓ ను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందనీ, ఆపరేటర్స్ భయాందోళన చెందవద్దన్నారు. పోల్ టాక్స్ రద్దు ఆపరేటర్స్ కు ఒక వరంగా మారనుందన్నారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పోల్ టాక్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తమకు 50 లక్షల బాక్స్ లు అవసరం ఉందని, నెట్ మరింత స్పీడ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బీబీఎన్‌ఎల్  ద్వారా నెట్ తీసుకుంటున్నాం అని తెలిపారు.

యజేసారు.

ఇంకా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని ఏపీఎస్‌ఫ్ఎఫ్‌ఎల్‌ ఛానల్ ప్రారంభిస్తున్నామన్నారు. ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని, గత పాలకుల తప్పుడు విధానాల వలన  ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అభివృద్ధి చెందలేదని… నాసిరకం పరికరాలు వాడడం వలనే కేసుల్లో ఇరుక్కున్నారనీ గౌతమ్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే పద్ధతిని విడనాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.