తాడేపల్లి జంక్షన్‌లో జగన్‌కు భారతి సంఘీభావం
వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించి ఇవాళ ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర గత నెల 27న ప్రారంభమైంది. యాత్ర ఇవాళ తాడేపల్లి మీదుగా విజయవాడ చేరుకుంటోంది. ఈ సమయంలో వైఎస్ జగన్ బస్సు, తాడేపల్లి సర్కిల్ కు వచ్చిన సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ భారతి జగన్ కు అభివాదం చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె కన్పించారు. భారతి పక్కన సెక్యురిటీ సిబ్బంది సైతం కన్పించారు.


