మిస్ వరల్డ్ పోటీలపై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై యూట్యూబర్ వసీం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. దీంతో అతడు పోలీసుల సమక్షంలో క్షమాపణ కోరాడు. కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కంటెస్టెంట్‌తో తప్పుగా ప్రవర్తించారని తాను పోస్టు చేసిన వార్తలో నిజం లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో ఉన్న రూల్స్ ను ఫాలో అవుతానని, మరోసారి ఇలాంటి తప్పు చేయనని వసీం పేర్కొన్నాడు.

