జగన్ ఇంటిపై రీల్స్‌తో యువత సెటైర్లు
తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటిని వైసీపీ ప్రభుత్వంలో కన్నెత్తి చూసే వీలు ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అక్కడ సెక్యూరిటీ, బారికేడ్లు తొలగించారు. దీనితో యువత ఈ ఇంటిని చూడడానికి ఎగబడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఇదే జగనన్న ఇల్లు అంటూ రీల్స్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం గుంతలు, గతుకుల రోడ్లు ఉంటే ఇక్కడ మాత్రం నున్నని విశాలమైన రోడ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ విశాలమైన బంగళాలు, చుట్టూ 30 అడుగుల ఎత్తైన ఇనుప ప్రహారీలు, వీధిదీపాలు, ఇతర సౌకర్యాలు చూసి విస్తుపోతున్నారు. గత ఐదేళ్లలో ఆ ప్రాంతం ఎంతో మారిపోయిందని, గతంలో అక్కడ పేదల గుడిసెలు ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు.

