బెట్టింగ్ వలలో చిక్కుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మధుర జిల్లాకి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల్లో మునిగిపోయాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చాలని బెట్టింగ్ నిర్వాహకులు సదరు యువకుడిపై ఒత్తిడి తేవడంతో.. మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని యువకుడు నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tollywood updates: ‘అఖండ 2’ పై జరుగుతున్న పుకార్లలో నిజం లేదు..!

