నడిరోడ్డుపై మద్యం మత్తులో యువతులు హల్ చల్
మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం తాగుతూ కారు నడిపి మత్తుతో యువతులు ఊగిపోయారు. రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులను కారు ఢీ కొట్టారు. హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కారుతో ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు. నడి రోడ్డుపై నానా హంగామా చేశారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.


 
							 
							