Home Page SliderTelangana

మద్యం మత్తులో యువకులు హల్ చల్

మద్యం మత్తులో ఉన్న మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఓ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులపై దూసుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ లోని అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులకు మందుబాబులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బూతులు తిడుతూ ట్రాఫిక్ పోలీస్ అధికారిపై ఊగిపోయారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేసి.. వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.