మద్యం మత్తులో యువకుడు వీరంగం.. మహిళలపై దాడి..
మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అతివేగంగా వెళ్తున్న యువకుడిని మెల్లగా వెళ్లు అని మందలించడంతో నలుగురు మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ పచ్చి బూతులు తిట్టాడు. మెడలో ఉన్న ఆరు తులాల బంగారపు చైన్ లాగేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎగువ బ్రాహ్మణ వీధిలో జరిగింది. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

