రాహుల్‌ను కొనుగోలు చేయలేరు…
రాజకీయ నేతలు.. మీడియాను, అంబానీ, అదానీలు కొనుగోలు చేసినట్లు… తన సోదరుడు రాహుల్‌ను కొనలేరని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. జోడో యాత్ర యూపీ రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాహుల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేకపోయింది. తన సోదరుడు యుద్ధ వీరుడని ప్రశంసించారు. జోడో యాత్రలో రాహుల్‌కు భయం కలగదా అని కొందరు తనను ప్రశ్నించారన్నారు… వారికి నేను ఒకే సమాధానం చెప్పాను. రాహుల్ సత్యం అనే రక్షణ కవచం ధరించి ముందుకు సాగుతున్నాడు.. ఆ భగవంతుడే నా సోదరుడిని సురక్షితంగా ఉంచుతాడని ఆమె స్పష్టం చేశారు. అందుకే చలికాలంలో కేవలం టీషర్టులు ధరించినా ఏమీ కాదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దాదాపు 3,000 కిలో మీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందన్నారు.

