Home Page SliderNational

వాట్సప్‌లో ఇకపై పంపించిన సందేశాలను ఎడిట్ చేసుకోవచ్చు

ఇకపై వాట్సప్ లో పంపించే సందేశాలను ఎడిట్ చేసుకోనే అవకాశం కల్పించింది సోషల్ మీడియా దిగ్గజం. ఇకపై ఎవరికైనా మేసేజ్ లను పంపించినప్పుడు.. వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోవడం ఈజీయే.. మనం పంపించిన సందేశం దగ్గర క్లిక్ చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ఉపయోగించి ఎవరికైనా పంపించిన మేసేజ్ లను ఎడిట్ చేయవచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా మేసేజ్ లను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి యూజర్లందరికీ వాట్సప్ డిలీట్ ఆప్షన్ ఉపయోగించడం ఎలా అన్న సందేశాలను పంపించింది. ఈ ఆప్షన్ గత మేలోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. చాలా మంది ప్రజలు దీనిని ఉపయోగించడం అర్థం కాక వాడుకోవడం లేదని వాట్సప్ గుర్తించింది. అందుకే తాజాగా యూజర్లకు ఈ సదుపాయానని ఉపయోగించాలని సందేశాలు పంపిస్తోంది.

https://faq.whatsapp.com/6614640168569481/?helpref=uf_share