ఫోక్సో కేసుపై యడ్యూరప్ప న్యాయపోరాటం
తనపై నమోదైన ఫోక్సో కేసు అన్యాయం అని, తనపై కుట్రకు పాల్పడే వారిపై న్యాయపోరాటం చేస్తానని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17 ఏళ్ల బాలికపై ఆయన అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ బాలిక తల్లి లోక్సభ ఎన్నికలకు ముందు ఆరోపణ చేసింది. ఓ మోసం కేసులో సహాయం కోసం ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిస్తే, తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది. అంతకు ముందే ఆమె వద్ద, ఆమె కుమార్తె వద్ద వాంగ్మూలం నమోదు చేశామని సీఐడీ పోలీసులు తెలిపారు.

