Andhra PradeshHome Page Slider

వైసీపీకి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడింది

పాలన అంటే వాళ్లకు కామెడీ అయిపోయింది
వైసీపీలో మాట్లాడే వారిలో ఎక్కువ మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే
ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు
జన సైనికులు, వీర మహిళలే పార్టీకి ఆక్సిజన్
ఓటు హక్కు ఏపీకి మార్చుకోవడం వల్లే తెలంగాణలో వినియోగించుకోలేదు

నెల్లూరు సిటీ, సూళ్ళూరుపేట, కొవూరు నియోజకవర్గాల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా రెండో రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాళ్ళో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట , కోవూరు , నెల్లూరు సిటీ నాయకులతో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు , జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిగాయి . ఈ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ అందరూ కలిసి పనిచేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.టీడీపీ , జనసేన పొత్తు లో భాగంగా ఎవరికి సీటు ఇచ్చినా అందరూ కలిసి వైస్సార్సీపీని ఎదుర్కోవాలని చెప్పారు. అలాగే పార్టి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి పోరాడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఖాళీ చేసిందని.. ఆ ఖాళీని భర్తీ చేయాలంటే కనీసం దశాబ్దాల కాలం పడుతుందని అన్నారు. దేవాలయంలాంటి శాసన సభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ మీద డ్యాన్స్ లు వేయడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు