Andhra PradeshHome Page Slider

వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి. కాగా వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు గుండెపోటు బారినపడుతున్నారు. ఈ గుండెపోటు రావడంతోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కృష్ణాజిల్లా మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని విజయవాడ కానూరులోని టాప్ స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసినట్లు తెలిపారు.  అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం టీడీపీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కూడా గుండెపోటుకు గురైయ్యారు.