Andhra PradeshNewsNews Alert

వైసీపీ, టీడీపీ డబుల్ గేమ్

Share with

ఏపీలో వైసీపీ,టీడీపీలు బీజేపీపై బురద చల్లుతున్నాయని అంటున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు,ట్రేడింగ్ పార్టీలని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఈ రెండు పార్టీలు గూడుపుటాని చేస్తున్నాయన్నారు. వైసీపీ,టీడీపీలది ధృతరాష్ట్ర కౌగిలి కాదు, ఆత్మీయ కౌగిలి అని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల 2014 లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజికి ఓకే చెప్పి డబ్బులు తీసుకున్నారన్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎంపీలు ప్రజలలో సానుభూతి కోసం పార్లమెంటులో మళ్ళీ ప్రత్యేక హోదా గురించి అడుగుతారన్నారు.

అయితే వైసీపీ అప్పుడు నోరు మెదపలేదు కానీ..ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కోసం వినతి పత్రాలను అందిస్తోందన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాకు డబ్బులు ఇవ్వడం లేదని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్లు ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి డబ్బులు ఇస్తామంటే సీఎం జగన్ ఎందుకు తీసుకోవట్లేదని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రతిపక్షాలు రాష్ట్రంలోని సమస్యలను లేవనెత్తినప్పుడు.. కుదరని వారితో మాట్లాడించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయనే మాట్లాడాలని సోము వీర్రాజు సూచించారు. పోలవరం కట్టలేక చంద్రబాబు, జగన్ చేతులేత్తేశారన్నారు. ఏపీ సీఎంకు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు పంచిపెట్టమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అదే విధంగా పోలవరం గురించి తప్ప మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అన్నారు. జనసేన,బీజేపీకి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయని… జనసేన,బీజేపీ పొత్తులో ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాజకీయ వ్యూహాలను బయటకు చెప్పాలిసిన అవసరం లేదన్నారు. తన పదవి ఊడిపోతుందంటూ..కొంతమంది పనికట్టుకుని ప్రచారం చేశారని చెప్పారు. అయినప్పటికీ తాను గత 43 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని..ఇకపై కూడా రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.