వరల్డ్‌కప్ టీ- 20 భారత్ ఘనవిజయం
అండర్ -19 వరల్డ్‌కప్ టీ20లో క్రికెట్‌లో భారత అమ్మాయిల టీమ్ అదరగొట్టింది. నేడు మలేసియాతో జరిగిన రెండవ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మలేసియాను కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌట్ చేసింది. ఒక్కరిని కూడా రెండంకెల స్కోరు చేరనివ్వకుండా బౌలర్లు అదరగొట్టారు. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా యువసేన, మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది. భారత బౌలర్ వైష్ణవి శర్మ ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు పడగొట్టింది. ఒకే ఓవర్‌లో కేవలం 3-0-0 స్కోర్‌తో ముగ్గురిని పెవిలియన్ దారి పట్టించి హ్యాట్రిక్ సాధించింది. భారత్ టీమ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 2.5 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని చేరింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 12 బంతుల్లో 27 పరుగులు చేసింది. దీనితో 31 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేరుకున్నారు.

