బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారించాలని నిర్ణయించింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు అధికార పార్టీలోనూ, ఇటు ప్రతిపక్ష బీజేపీలోనూ చిచ్చు రేగుతోంది. కవితపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని బీజేపీ ముఖ్యనేతలు ఎంపీ అర్వింద్, పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్జీ అభిప్రాయపడ్డారు.


