ఇఫ్తార్ విందులో పాల్గొన్న టాలీవుడ్ స్టార్స్ భార్యలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనలు తాజాగా వారి ఫ్రెండ్ షీమా నజీర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పార్టీలకు ఎప్పుడూ జంటగా వెళ్లే మహేశ్-నమ్రతలు ఈ పార్టీకి జంటగా హాజరుకాలేదు, కేవలం నమ్రత మాత్రమే హాజరయ్యారు. మహేశ్ బాబు దర్శకుడు రాజమౌళితో చేస్తున్న సినిమా కారణంగా బయటకు వెళ్లకూడదని నియమం ఉంది కాబట్టి ఇటీవల ఆయన వెళ్లడం లేదు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. వీరందరూ ముస్లిం ట్రెడిషన్ దుస్తుల్లో కనిపించడం విశేషం.

