Home Page SliderNational

డీఎన్ఏ రిపోర్టుతో స్పష్టతో… శరీర భాగాలు శ్రద్ధావాకర్‌వే..

శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులకు ఎట్టకేలకు కొన్ని ప్రధాన సాక్ష్యాధారాలు లభించాయి. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో, గురుగ్రామ్‌లోని ఒక అడవిలో కన్పించిన ఎముకలు శ్రద్ధావేనని తేలింది. ఆఫ్తాబ్ పూనావాలా విచారణలో ఈ విషయమై పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఎముకలు నిజంగా ఆమెవేనని DNA పరీక్షలో స్పష్టమైంది. ఫ్లాట్‌లో లభించిన రక్తపు జాడలు కూడా ఆమెతో సరిపోలుతున్నాయని, ఆమె తండ్రి డీఎన్‌ఏ నమూనాలు తేల్చేశాయి. ఆఫ్తాబ్ పూనావాలా అరెస్టయిన ఒక నెల తర్వాత కీలక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. అతను ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచి… తరువాత 18 రోజుల పాటు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో అద్దె ఫ్లాట్ సమీపంలోని అడవిలో పడేసినట్టు నిర్ధారించారు.

ఇప్పటివరకు, సాక్ష్యాధారాల జాబితాలో, ఆప్తాబ్ పూన్‌వాలా ఉపయోగించిన కత్తులు, అతని అంగీకారంతోపాటు కొన్ని సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయి. వాటితో కేసు విచారణ చేయడం కష్టమని భావించిన పోలీసులు శ్రద్ధా తండ్రి డీఎన్ఏ నమూనాలను పరీక్షించాలని భావించారు. హత్యకు ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడానికి సాక్ష్యంగా ఇది ఉపకరిస్తుంది. అఫ్తాబ్ పూనావాలా మే 18న శ్రద్ధా వాకర్‌ను చంపినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ సాక్షాధారాల కోసం పోలీసులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్‌లో పోలీసులు, శ్రద్ధా తండ్రి మహారాష్ట్రలోని స్వగ్రామంలో పోలీసులకు వెళ్ళిన తర్వాత నేరం క్రమంగా వెలుగులోకి వచ్చింది.

వికాస్ వాకర్, ఆఫ్తాబ్ పూనావాలాతో మతాంతర వివాహం అంగీకారం కాదని చెప్పి.. వారికి దూరంగా ఉంటూ వచ్చారు. డేటింగ్ యాప్‌తో పరిచయమైన ఈ జంట ఈ ఏడాది మేలో ఢిల్లీకి మారడానికి ముందు ముంబై సమీపంలోని వారి స్వస్థలమైన వాసాయ్‌లో కొన్ని నెలలు కలిసి జీవించారు. 2020లో ఆమెపై దాడి చేసినట్లు నివేదించినప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించేందుకు తండ్రి ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐతే ఆ తర్వాత ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఆమె రాతపూర్వకంగా పోలీసులకు నివేదించారు.