Home Page SliderTelangana

ఎన్నికల్లో ఓడిపోతామనే కేసీఆర్ ప్రభుత్వం ప్రవళిక ఉదంతాన్ని తొక్కి పెడుతుందా?

తెలంగాణాలో ప్రవళిక ఆత్మహత్య పెను సంచలనం సృష్టించింది. కాగా వరంగల్ జిల్లాకి చెందిన ప్రవళిక హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతుంది. అయితే ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం తెలంగాణా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో జరగాల్సిన గ్రూప్-2,డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రవళికకు న్యాయం చేయాలంటూ నిరసనలు చేపట్టారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా దీనిపై బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ స్పందించారు.ఎన్నికల్లో ఓటమిపాలవుతామనే ప్రవళిక ఉదంతాన్నికేసీఆర్ ప్రభుత్వం తొక్కి పెడుతుందని ఆరోపించారు.సున్నితమైన ప్రవళిక ఆత్మహత్య ఉదంతంతో..ప్రభుత్వ అసమర్ధత బయట పడుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ అంశం రాజకీయంగా తమ అవకాశాలపై ప్రభావం చూపబోతుందన్న నెపంతోనే ప్రవళిక ఆత్మహత్య ను తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. సంఘటన స్థలంలో తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి అమానవీయంగా దాడి చేశారని సోమవారం నాంపల్లి లోని మానవహక్కుల కమీషన్ కు దాసు సురేశ్ ఫిర్యాదు చేసారు.ప్రవళిక గ్రూప్-1 ఇతర పోటీ పరీక్షలకు ప్రవళిక హాజరు కాలేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను దాసు సురేశ్ ఖండించారు. ఆత్మనూన్యతతో ఉన్న ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవడం చేతకాక ఆమె కుటుంబ పరువును బజారుకీడ్చే విధంగా కేటీఆర్ అబాండాలు వేయడం ఆక్షేపణీయమన్నారు. పార్టీలో చేరికలకు ఉన్న తీరిక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కేటీఆర్ కు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రవళిక యాదవ బిడ్డ అని, బలహీన వర్గపు బిడ్డయినందుకే ప్రభుత్వం ఈ విధంగా దురహంకారంతో వ్యవహరిస్తున్నదన్నారు. దిశ విషయంలో చొరవతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవళిక విషయంలో ఎందుకు మౌనం వీడలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు.నిరాధారంగా ప్రవళికపై పోలీసుల నిందలు ఆపాదిస్తున్నారని ప్రవళికది ప్రేమ వ్యవహారం కాదని, నిస్సహాయ స్థితిలోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తాను రాసిన గ్రూప్-1,గ్రూప్-4 లకు సంభంధించిన హాల్ టికెట్ ఆధారాలను జాతీయ మీడియాకు అందజేశారు.