రతన్ టాటా కుటుంబాన్ని ఆశ్చర్యపరచిన వీలునామా..
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త దివంగత రతన్ టాటా వీలునామా చూడగా, ఇటీవల ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యపోయారు. దీనికి కారణం వారి అంచనాలకు అందని ఒక రహస్య వ్యక్తి పేరు అందులో ఉండడమే. జంషెడ్‌పూర్‌కు చెందిన మోహిని మోహన్ దత్తా అనే వ్యక్తికి రూ. 500 కోట్లకు పైగా విరాళం ఇవ్వాలంటూ వీలునామాలో పేర్కొన్నారు. దీనితో అతనెవరా అనే ఆసక్తి వారిలో నెలకొంది. రతన్ టాటాతో మోహినీ మోహన్ దత్తాకు ఉన్న అనుబంధం గురించి పెద్దగా తెలియదు, కానీ అతని జీవితం గురించి తెలిసిన వారు ఆయన చాలా సంవత్సరాలుగా విశ్వసనీయ సహచరుడిగా ఉన్నారని చెప్పారు. గతంలో 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనమైన స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీని చెందినవారని సమాచారం.


 
							 
							