Home Page SliderNational

 దేశంలో రూ.1000 నోట్లు మళ్లీ  చెలామణిలోకి వస్తాయా?

దేశంలో ఎన్నో సంవత్సరాల తర్వాత మోదీ అధికారంలోనే 2016 లో ఇంతకుముందు ఉన్న రూ.500,రూ.1000 రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. అయితే వీటిని రద్దు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వీటిని మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కాగా ఇప్పుడు మరోసారి కేంద్రం ప్రభుత్వం తాము గతంలో తీసుకువచ్చిన రూ.2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలంతా తమ వద్ద ఉన్న రూ.2000 రూపాయల నోటును సెప్టెంబరు 1 లోపు బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. దీంతో పెద్ద నోట్లను మార్చేందుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. అయితే ఈ నోట్ల రద్దుపై RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఉద్దేశం లేదన్నారు. అంతేకాకుండా దేశంలో ఇప్పటికే రద్దు చేసిన రూ.1000 నోట్లను తిరిగి తీసుకువచ్చే ఆలోచన కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 19 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మే 31 నాటికి దేశంలో ఉన్న రూ.2000నోట్లు  50 శాతం వెనక్కి వచ్చాయని పేర్కొన్నారు. కాబట్టి ఎటువంటి పుకార్లను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. గడువు లోగా ప్రజలు రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవాలని RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు.