Home Page SliderNationalSports

‘కోహ్లిని ఎందుకు ఎవరూ ప్రశ్నించరు’..కుంబ్లే

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఇటీవలి ప్రదర్శనలపై  ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదని సీనియర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే మండిపడ్డారు. అసలు కోహ్లిని ప్రతీ ఆటలకు ఎలా అనుమతిస్తున్నారు అని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా చూస్తున్నా..టెస్టు మ్యాచ్‌లలో ఏమాత్రం ఆశాజనకంగా ఆడడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంక కోహ్లి తన బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని లండన్‌లో సెటిల్ అయిపోవచ్చన్నారు. అంటే భారత్‌కి కోహ్లి క్రికెట్ సేవలు అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల కోహ్లి అవుటయిన తీరుపై సునీల్ గావస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.