మనూబాకర్ ఎక్కడికెళ్లినా ఒలింపిక్ పతకాలు ఎందుకు తీసుకెళుతోందంటే..
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ మహిళా షూటర్ మనూబాకర్ రెండు ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై ఎక్కడికి వెళ్లినా ఒలింపిక్ పతకాలు వెంట తీసుకెళ్లి ప్రదర్శిస్తోందని ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దీనికి ఆమె తెలివిగా, చురుకుగా బదులిచ్చింది. “పారిస్ ఒలింపిక్స్ 2024లో నేను సాధించిన పతకాలు భారతదేశానికి చెందినవే. నన్ను ఎవ్వరైనా ఈవెంట్‌కు పిలిచేదే ఈ ఒలింపిక్స్‌లో గెలిచినందుకు. వారు నన్ను పతకాలు చూపించమని అడిగితే సంతోషంగా చూపిస్తాను. ఈవెంట్ నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు. ఈ పతకాలు నాకు, దేశానికి గర్వకారణం” అంటూ కామెంట్స్ పెట్టింది.

