కేసీఆర్‌పై కేసులు ఎందుకు పెట్టడం లేదు… తెలంగాణలో 3 పార్టీల మధ్య అనుబంధం- రాహుల్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావుకు కొత్త ఎన్నికల సవాల్ విసిరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుల గణన విషయంలో మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సర్వే చేయిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్నాటకలో ఇప్పటికే కుల గణన సర్వే చేపట్టామని, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో కూడా అదే పని చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఎంత దోచుకుందో కుల గణన తేటతెల్లమవుతోందని తెలంగాణలోని భూపాలపల్లిలో రోడ్‌షోలో రాహుల్ అన్నారు. బీఆర్‌ఎస్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంలు బీజేపీకి సహకరిస్తున్నాయని, కాంగ్రెస్‌పై ఉమ్మడి దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

‘ప్రధాని (నరేంద్ర) మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు చేసినప్పుడు తెలంగాణ ప్రజలు కుల గణన సర్వేను ఎప్పుడు నిర్వహిస్తారని వారిని ప్రశ్నించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బీజేపీ వారిపై కేసులు వేస్తోందని, కానీ కేసీఆర్‌పై కేసులు లేవని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసులు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. 2014లో రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ ప్రజలు సామాన్యులు పరిపాలించే రాష్ట్రం కావాలని కలలు కంటే దొరల తెలంగాణ వచ్చిందని రాహుల్ విమర్శించారు. గత పదేళ్లలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు దూరం అయ్యారని, ఆయన కుటుంబమే రాష్ట్రాన్ని పాలిస్తోందని.. ప్రజల కలలను కేసీఆర్ ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు.

కుల గణన, దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్యని రాహుల్ గాంధీ అన్నారు. “ఇది వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల శాతాన్ని వెల్లడించే ఎక్స్-రే లాంటిది, సమానమైన బడ్జెట్ కేటాయింపులను అనుమతిస్తుంది.” తెలంగాణకు రాష్ట్ర ఏర్పాటు హామీని నెరవేర్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమని, తెలంగాణ ప్రజలతో నాకున్న అనుబంధం ప్రేమ, ఆప్యాయత అని, మీతో రాజకీయ బంధం కోసమే కేసీఆర్, మోదీ తెలంగాణకు వస్తున్నారని అన్నారు. మీతో అనుబంధం ప్రేమ, ఆప్యాయతపై ఆధారపడి ఉంటుంది.” అని రాహుల్ చెప్పారు. భారతదేశంలోనే తెలంగాణలో అత్యధిక అవినీతి ఉందని, ఇది తెలంగాణ యువత మరియు మహిళలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాదయాత్రలో డాబాలపైన, రోడ్డుపక్కన గుమికూడిన ప్రజలకు చేతులు ఊపుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం కనిపిస్తోందని రాహుల్ తెలిపారు. ఎన్నికలకు ముందు కుల గణన అంశం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది.

ఆరు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు కులాల సర్వే ఎందుకు చేయలేదని గతంలో కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కె.కవిత ప్రశ్నించారు. “ఈ కాంగ్రెస్ నాయకుడు వెనుకబడిన తరగతుల జనాభా గణన గురించి మాట్లాడటం ప్రారంభించాడు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వారు చేయలేదు. ఇప్పుడు అతను ఏదో చేస్తానని చెప్పాడు,” అని ఆమె విమర్శించారు. కాగా, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో రాష్ట్రంలో కులాల సర్వే నిర్వహించింది. సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలను సవాలు చేస్తున్న వ్యాజ్యాల కారణంగా బహిరంగపరచలేదు, అయితే రాష్ట్ర ప్రభుత్వం విధాన మార్పుల కోసం డేటాను ఉపయోగించినట్లు చెబుతోంది. కేసీఆర్ సర్కారు సర్వే నిర్వహించింది అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడానికి వీలు కల్పించాయని కవిత చెప్పారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్‌లా కాకుండా ఎన్నికల ముందు కేవలం గాంధీ ప్రకటనలు పరిమితవుతున్నారని కవిత దుయ్యబట్టారు.

