Home Page SliderNational

కౌన్ బనేగా కర్ణాటక సీఎం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని అందుకొని..ప్రత్యర్థుల గుండెల్లో బాంబు పేల్చింది. అయితే కాంగ్రెస్ ఇంతటి ఘనవిజయాన్ని అందుకున్నప్పటికీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో మాత్రం అధిష్టానం తలామునకలౌతోంది. కాగా దీనిపై హైకమాండ్ నిర్ణయం కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరోవైపు సీఎం పదవి రేస్‌లో ఉన్న సిద్దరామయ్య,డీకే శివకుమార్ సీఎం పదవి కోసం ఓ రేంజ్‌లో పోటి పడుతున్నారు. కాగా ఇది వరకే కర్ణాటక  సీఎంగా పనిచేసిన అనుభవాన్ని సిద్దరామయ్య సెంటిమెంట్‌గా చూపించారు. కానీ డీకే శివకుమార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి చాలా కష్టపడ్డానని..అయినప్పటికీ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తానని తెలిపారు.అయితే ఈ రోజు డీకే శివకుమార్ పుట్టినరోజు కావడంతో పార్టీ ఏ గిఫ్ట్ ఇస్తుందో అని కూడా వేచి చూస్తున్నానని డీకే స్పష్టం చేశారు. ఈ విధంగా సీఎం వదవి రేస్‌లో ఉన్న ఇద్దరు అభ్యర్థులు సిద్దరామయ్య,డీకే శివకుమార్ ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మాత్రం సీఎం పదవిని పంచుకుందామనే ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచగా..డీకే మాత్రం దీనికి ససేమీరా అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాల్సివుంది.