ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారు?
ప్రొఫెసర్ సాయిబాబా జీవితం మొత్తం ప్రజా సేవకే అర్పించారని మాజీ మంత్రి హరీశ్రవు అన్నారు. మౌలాలిలోని సాయిబాబా నివాసా నికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. వైకల్యం కారణంగా జీవితం మొత్తం కుటుంబం సహకారంతోనే గడిపినప్పటికీ ప్రజా ఉద్యమాన్ని ఆపలేదన్నారు. జైల్లో ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిర్దోషి గా బయటకు వచ్చిన సాయిబాబా అనారోగ్యం తో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

