ఏది పుణ్యకాలం…ఏది పాపకాలం?
చాతుర్మ్యాసం ప్రారంభానికి ముందు వచ్చే ఏకాదశి (శయన ఏకాదశి) నాడు శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి,భక్తుల మొరనాలకించి.. నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొని ముక్కోటి దేవతలకు తొలి దర్శనం కల్పించే ఆథ్మాత్మిక ప్రక్రియే వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యంగా చెప్పొచ్చు.యోగ నిద్ర అనంతరం వైకుంఠం ఉత్తర వాకిలి నుంచే శ్రీమహావిష్ణువు దేవతలకు దర్శన భాగ్యం కల్పిస్తారు.అక్కడ నుంచి అంతా భూలోకం చేరుకుని భక్తులకు దర్శనమిస్తారు.వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణు మూర్తి గరుడారూఢుడై భూలోక ఆలయాలకు చేరుకుంటారు.ఇదంతా సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణానికి వచ్చే చివరి రోజున జరుగుతుంది. ఇన్నాళ్ళు సూర్యుని చుట్టూ సాధారణంగా తిరిగిన భూమి…ఇక నుంచి సూర్యుని చుట్టూ వంగి ప్రయాణిస్తుంది.ఈ కారణం చేత మనకు వేసవి ఏర్పడుతుంది.ఈ వైకుంఠ ఏకాదశి నుంచే సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు(సంక్రాంతి).శ్రీమహా విష్ణువు యోగ నిద్రలో ఉన్నంత సేపు ప్రంపంచం అస్తవ్యస్థంగా మారుతుంది.దీన్నే పుణ్యరహిత కాలం అంటారు.సంక్రాంతి తర్వాత నుంచి వచ్చేది పుణ్య కాలం.అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు.అక్కడ నుంచి ప్రమాదాలు,ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి.సర్వమానవాళికి జీవన విధానాన్ని ప్రతీ రోజు ఎలా నేర్చుకోవాలి,ఎలా మార్చుకోవాలో తెలిపేదే వైకుంఠ ఏకాదశి.అందుకే ఈ రోజు ఉపవాసం,జాగరణ,హరినామ సంకీకర్త,పారాయణం ,జపతపాదులు,దాన ధర్మాలు చేసి తరిస్తుంటారు.


 
							 
							